మహిళ ఆత్మహత్యపై కేసు నమోదు

59చూసినవారు
మహిళ ఆత్మహత్యపై కేసు నమోదు
అనారోగ్య రీత్యా జీవితంపై విరక్తితో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు పెదవేగి ఎస్సై రాజేంద్రప్రసాద్ బుధవారం తెలిపారు. ఆయన కథనం మేరకు. న్యాయంపల్లికి చెందిన నల్లమెల్లి నిర్మల (50) ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెందిన ఆమె మంగళవారం ఇంటి వద్దే గడ్డి మందు తాగడంతో కుటుంబసభ్యుల వెంటనే ఆమెను ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్