దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదివారం పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలకు సంబంధించి అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.