పెదపాడులో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు

72చూసినవారు
పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పెదపాడు పోలింగ్ కేంద్రం 91 పరిధిలో మొత్తం 72 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 40, మహిళలు 32 మందిగా ఉన్నారు. అలాగే పోలింగ్ ప్రక్రియ పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ కేంద్రాన్ని నూజివీడు డిఎస్పీ ప్రసాద్, పెదవేగి సీఐ వెంకటేశ్వరావు పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్