పెదవేగి మండలం దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అభిమానులు భారీగా పోటెత్తారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలలో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము నుండి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు చెందిన నాయకులు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు పుల బొకేలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.