పెదవేగిలోని గురుకుల బాలుర పాఠశాలలో ఈ నెల 10న జరగాల్సిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జూనియర్ కళాశాలల అండర్-19 క్రీడా జట్ల ఎంపిక పోటీలను వర్షాల కారణంగా వాయిదా వేసినట్లు ఉమ్మడి జిల్లా కార్యదర్శి కె. జయరాజు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిగిలిన తేదీల్లో జరిగే పోటీలు యథావిధిగా ఉంటాయన్నారు.