రాజమండ్రిలో శెట్టిబలిజ నీరా కార్పొరేషన్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన శెట్టిబలిజ దన్ను కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం కార్పొరేషన్ సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేసిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. అలాగే శెట్టిబలిజల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు.