ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పేదల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని ఉంగుటూరు ఎంపీడీవో రాజ్ మనోజ్ తెలిపారు. శనివారం, చేబ్రోలు, అక్కుపల్లి గోకవరం గ్రామ పంచాయతీ వద్ద "మన ఇల్లు-మన గౌరవం" కార్యక్రమంలో లబ్ధిదారులకు అవగాహన సదస్సు జరిగింది. 1.0 స్కీమ్, 2.0 స్కీమ్ పై అవగాహన పెంచుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.