త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం ఈవీఎం గోడౌన్లను పరిశీలించారు. ఆమె వెంట వివిధ పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం మిషన్లను భద్రపరచిన గోడౌన్ల వద్ద పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పనితీరును క్షుణంగా పరిశీలించారు. అగ్నిమాపక దళ పరికరాలను తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు.