ఏలూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం 6 గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద 2, 64, 966 మందికి రూ. 113. 24 కోట్లు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. అదేవిధంగా జిల్లాలో సచివాలయ సిబ్బంది మరియు కూటమి నాయకులు ప్రతి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 16, 124 మందికి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది.