పొగాకు పంటలో నియంత్రణ పాటించి లాభసాటి అయిన పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సెల్వి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొగాకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళా సంఘాలు ఆచరించాల్సిన సప్తసూత్రాల గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.