వరల్డ్ ఫుడ్ ఇండియా పేరిట దిల్లీలో నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఏలూరు జిల్లా ఆహార ఉత్పత్తులు ప్రదర్శించబడటం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం అన్నారు. రాష్ట్రంలో 10 జిల్లాల నుంచి ఉత్పత్తులు ఎంపిక కాగా కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం గ్రామానికి చెందిన మథర్ థెరీసా మహిళా స్వయం సహాయక సంఘ అధ్యక్షురాలు కృపామణి తయారు చేస్తున్న చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రదర్శనకు ఎంపికకావడం అభినందనీయమన్నారు.