ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ 'పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్' లో వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిస ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని అన్నారు.