గురజాడ అప్పారావు గొప్ప సంఘసంస్కర్త, సాహితీ కారుడు, అభ్యుదయ కవి అని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరక శ్యామల, మన్నవ యామిని కొనియాడారు. ఏలూరులో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం నందు అప్పారావు 162వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు. గురజాడ తన కవిత, రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అన్నారు.