ఏలూరు నగరంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని బిట్టు బార్ సమీపంలో ఒక భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.