ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఇంధన శాఖ మరియు విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో కలిసి విద్యుత్ ఆదా అవగాహాన ర్యాలీను ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ పొదుపుగా విద్యుత్ మరియు ఇంధనాన్ని వాడుకోవాలని అన్నారు.