ఏలూరు సి. ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో యాంటీ ర్యాగింగ్, సోషల్ మీడియా వలన జరిగే అనర్ధాలను గురించి పోలీసులు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిఎస్పీడీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ. ర్యాగింగ్ అనేది ఒక సామాజిక రుగ్మతగా తయారయిందని అన్నారు. చదువుకునే రోజుల్లో ఏదో సరదాగా చేసే ర్యాగింగ్ వలన ఎదుటివారి మనోభావాలకు భంగం కలిగి ఎంతో మనోవేదన చెందుతున్నారని అన్నారు.