ఏలూరు జిల్లాలో ప్రిన్సిపల్ వేధింపులకు ఓ విద్యార్థి శనివారం ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. అచ్యుత్ అనే విద్యార్థి ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఫారెన్సీక్ కౌన్సిలింగ్ కి రేపు ఆఖరి రోజు కావడంతో సర్టిఫికెట్లు ఇవ్వమని యాజమాన్యాన్ని కోరాడు. ర్టిఫికెట్ ఇవ్వకుండా కాలేజీ ప్రిన్సిపాల్ అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో మనస్థాపనకు గురైన విద్యార్థి అచ్యుత్ ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు.