ఏలూరు జిల్లా అదనపు ఎస్పీగా సూర్యచంద్రరావు సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు పూల మొక్కలు, పుష్ప గుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నేర నియంత్రణకు కృషి చేస్తానని తెలియజేశారు. అలాగే ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.