విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియ రద్దు చేయాలి

54చూసినవారు
రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు, నివాస గృహాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను నిలుపుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఏలూరులో సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. ఈ ప్రక్రియ వల్ల రాష్ట్ర వినియోగదారులపై రూ. 4486. 93 కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు.

సంబంధిత పోస్ట్