నరసాపురం టౌన్ 25వ వార్డు వివర్స్ కాలనీలో 22 లక్షల రూపాయలతో నిర్మించిన సి.సి రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కొల్లాబత్తుల రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి బర్రి శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బర్రి శ్రీ వెంకటరమణ జయరాజు, పట్టణ అధ్యక్షులు బూసారపు జయ ప్రకాష్, వైస్ చైర్మన్ కొత్తపల్లి నాని, దొండపాటి స్వాములు, కౌన్సిలర్ యర్రా ఉమా శ్రీను, వై కె యస్, కావలి నాని, దొంగ మురళీ కృష్ణ, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.