చింతలపూడి: ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్పీ

79చూసినవారు
చింతలపూడి పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు ఆశను అదుపులో ఉంచుకోవాలన్నారు. జూదం చిన్న ఆటగా పరిగణనలోకి తీసుకోకూడదని, జూదాలతో సమాజానికి ప్రమాదం ఉందన్నారు. జూదం ఆడి పట్టుబడిన వారిని రిమాండ్‌కు తరలిస్తారని హెచ్చరించారు. అలాగే ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్