కోల్ కత్తా జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం నరసాపురంలోని వైద్యులు నిరసన ప్రదర్శన చేశారు. ఇందులో భాగంగా వైద్య సేవలు నిలిపివేశారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు. అనంతరం ఆర్డీవో అచ్యుత్ అంబరీష్కు వినతిపత్రం అందజేశారు.