మొగల్తూరులో ఘనంగా మహాత్మా జ్యోతిరావుపూలే 197వ జయంతి వేడుకలు

65చూసినవారు
మొగల్తూరులో ఘనంగా మహాత్మా జ్యోతిరావుపూలే 197వ జయంతి వేడుకలు
భారతీయ సామాజిక కార్యకర్త, కుల వ్యతిరేక సంఘ సంస్కర్త , రచయిత మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా గురువారం మండల కేంద్రమైన మొగల్తూరు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గల జ్యోతిరావుపూలే విగ్రహానికి మొగల్తూరు గ్రామ సర్పంచ్ పడవల మేరీ సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోనం నరసింహారావు పంచాయతీ పాలకవర్గ సభ్యులు కొండ ఆదాము, రామనాథం బుజ్జి, మద్దూర్ పెద్దిరాజు, తదితరులున్నారు

సంబంధిత పోస్ట్