నరసాపురం పట్టణంలో ఒకటో వార్డు శ్రీహరిపేటలో వేంచేసియున్నశ్రీ శ్రీ శ్రీ వీరభవాని అమ్మవారి ఆలయం నందు మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామానికి చెందిన సోమయ్య- లక్ష్మి దంపతులు వారికుటుంబ సభ్యులు అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వారి ఆర్థిక సహకారంతో అమ్మవారి ఆలయం నందు సుమారుగా 2 వేల మంది భక్తులకు, శివ స్వాములకు, అయ్యప్పలకు అన్న ప్రసాద వితరణ చేసారు.ఈ కార్యక్రమం అత్యంత వైభవముగా జరిపారు.