టి. నరసాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెం గ్రామంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన తాడిపర్తి వెంకట రమణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 1600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసీ సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ పి. అశోక్ తెలిపారు.