పాలకొల్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా పిసిసి సభ్యులు కొరగింజల హరి కిరణ్ శనివారం భాద్యతలు చేపట్టారు. ఆయనను 3 రోజుల క్రితం పిసిసి అధ్యక్షురాలు షర్మిల నియమించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు పాలకొల్లులో కొత్త ఇన్ ఛార్జ్ ని నియమించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ. పాలకొల్లులో తిరిగి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసికొస్తానని చెప్పారు.