పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎక్సైజ్ సీఐగా మద్దాల శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయనకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాఖ పరిధిలో ఎటువంటి తప్పులు తలెత్తకుండా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా సర్కిల్ పరిధిలో నాటు సారా తయారీ విక్రయాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.