పాలకొల్లుకి చెందిన అరేళ్ళ కుర్రాడు ఈలప్రోలు దార్షిక్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన సౌత్ ఇండియా సీనియర్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్ లో జూనియర్ విభాగంలో అండర్ 8 విభాగంలో విన్నర్ గా, అండర్ 9 విభాగంలో రన్నర్ గాను నిలిచినట్లు కోచ్ కిరణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్టీఆర్ స్టార్ అవార్డును గెలుచుకున్నట్లు కిరణ్ చెప్పారు. ఈ క్రమంలో సోమవారం దార్షిక్ ను టౌన్ హాల్ అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు.