పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్టీఆర్ చేసిన సేవలను ఎవరు మరువలేరని అన్నారు. అలాగే తాలూకా వ్యవస్థను తొలగించి మండల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు మరింత దగ్గరగా ప్రభుత్వ సేవలను అందజేశారని అన్నారు.