పాలకొల్లు టౌన్ యడ్ల బజారులో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి వారిని బుధవారం హైకోర్టు జడ్జి శేష సాయి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు రమణ గురుస్వామి గోత్ర నామాలతో అర్చన చేసి స్వామి వారి చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా శేష సాయి మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు.