విజయవాడ ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు చెందిన సిఈ, ఎస్ఈ, లతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల అత్యవసర పనుల నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన 284 కోట్లతో వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.