జిల్లా ఇన్చార్జి మంత్రిగా, రాజమహేంద్రవరం కు తొలిసారి విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు ను, జిల్లా ఎస్పి నరసింహ కిశోర్ శనివారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిసారు. పచ్చటి మొక్కను అందజేసి మంత్రి నిమ్మలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని, ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీకి సూచించారు. టిడిపి నేతలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.