కొయ్యలగూడెం మండలం రాజవరంలో కలుషిత నీరు తాగి ఏడు మూగజీవాలు మృత్యువాత పడిన ఘటనపై పశుసంవర్దక శాఖ సహాయ సంచాలకుడు శేఖర్ దొర సోమవారం విచారణ చేపట్టారు. మూగజీవాలు నీరు తాగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధిత రైతు నుంచి వివరాలు తెలుసుకున్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా ఉన్న తాధికారులకు నివేదిక అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పశుసంవర్ధకశాఖ నూజివీడు డివిజన్ ఉప సంచాలకుడు చంద్ర శేఖర్ సైతం ఆరా తీశారు.