ఇచ్చిన మాట ప్రకారం పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ అందజేసిన కూటమి ప్రభుత్వానికి చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు, పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బయ్యనగూడెంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత ఎన్నికల్లో నిర్వాసితులకు ప్యాకేజీ అందజేస్తామని జగన్ మాయ మాటలు చెప్పి ప్యాకేజీ అందజేయలేదని కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ప్యాకేజీ అందజేసిందన్నారు.