పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో బుధవారం రాత్రి పారుపల్లి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి గరగలతో గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రామ ఆడపడుచులు సొంతూరికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.