ఉదయాన్నే పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

69చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని 14వ వార్డులో మంగళవారం ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి నేరుగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్