'మన ఊరు మన పరుగు' పేరుతో డిసెంబర్ 8న తణుకులో రోడ్డు రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు విశ్వతేజ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రన్ ఫర్ ది ఫ్యూచర్ అనే సందేశంతో ఆరోగ్యం, శరీర దృఢత్వంపై అవగాహనతో పాటు క్లీన్ ఆంధ్ర గ్రీన్ నినాదంతో కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఇందులో 10, 5, 3కె విభాగాల్లో అన్ని వయసుల వారు ఈ పరుగులో పాల్గొనవచ్చని కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.