పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణం నుంచి తణుకు-విజయవాడ నూతన బస్సు సర్వీసును ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఈ బస్సు సర్వీసును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ గిరిధర్ కుమార్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.