సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికోసం ఈ నెల 6, 7 తేదీల్లో కల్పిస్తున్న పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉండి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.