ఆకివీడు శివారులోని ఉప్పుటేరు వంతెన వద్ద నీటి ప్రవాహం ఎక్కువైన నేపథ్యంలో సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే ఉప్పుటేరును ఆనుకుని ఉన్న గ్రామాలు దుంపగడప, ఆకివీడులోని సమతా నగర్‌కు సంబంధించి 250మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అన్నారు. జేసీ, ఎస్పీ అస్మి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.