పాలకోడేరు మండలం విస్సా కోడేరు గ్రామంలోని సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలకోడేరు మండల ఎంపిపి చంటి రాజు పాల్గొని మాట్లాడుతూ.. మహిళా శక్తి ఆదిపరాశక్తి వంటిదని మహిళలను పూజించుట సశస్యమంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంటెన్స్ ప్రిన్సిపల్ స్వర్ణలత, సర్పంచ్ బొల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.