ఉంగుటూరు తహశీల్దారుగా అందరి మన్ననలు పొంది బదిలీపై వెళుతున్న బొడ్డేపల్లి దుర్గా ప్రసాద్ ను మండల కళింగ సంఘం గురువారం సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఉంగుటూరు రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్న ఆయనకు ప్రభుత్వం తహశీల్దారుగా పూర్తి బాధ్యతలు అప్పగించడంతో ఉంగుటూరు తహశీల్దారుగా విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందటం అభినందనీయమని కళింగ సంఘం అధ్యక్షుడు గురువెళ్లి రాజారావు అన్నారు.