మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య ఆరాథనం సకల శుభాలు ప్రసాదిస్తుందని ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచన కర్త డాక్టర్ జటావల్లభుల సాయి రామ్ అన్నారు. గురువారం సాయంత్రం ఉంగుటూరు మండలం కైకరం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి 90వ షష్ఠి మహోత్సవాల్లో భాగంగా సాయిరామ్ స్కాంద పురాణాంతర్గత విశేషాలు సోదాహరణంగా శ్లోక, పద్యాలాపనంతో వివరించారు.