యలమంచిలి మండలం బూరుగుపల్లి రీ సర్వే పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్ జెవి.మురళి పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన రీ సర్వే పనులను సబ్ కలెక్టరు సి.విష్ణు చరణ్ తో కలసి శుక్రవారం గ్రామ సచివాలయంలో సమీక్ష చేశారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సర్వే కార్యక్రమం కింద వివాదాలు లేని భూ రికార్డుల రూపకల్పనకు రీ సర్వే పనులను తది తర అంశాలు పై సమీక్షించారు. అనంతరం క్షేత్రస్థాయిలో భూ సర్వే పనులను పరిశీలించారు.