భీమవరం: ఉల్లి, పామాయిల్ ప్రత్యేక కౌంటర్ల ద్వారా అమ్మకాలకు చర్యలు
నాణ్యమైన ఉల్లి పాయలు కిలో రూ.50, పామాయిల్ రూ.110 చొప్పున ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక కౌంటర్లు ద్వారా వినియోగదారులకు సరసమైన ధరలకు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్ లోని వారి ఛాంబరులో సివిల్ సప్లైస్, మార్కెటింగ్, హోల్ సేల్ ఉల్లిపాయిల వర్తకులతో సమావేశమయ్యారు. వినియోగదారులకు అందుబాటు ధరలలో ఉల్లిపాయలు, పామాయిల్ అందించేందుకు సమీక్షించారు.