తెలుగు రాష్ట్రాలపై భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఏపీలో మార్చి నెలలోనే ఎండలు దంచికొడుతున్నాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 167 మండలాల్లో వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఆ సమయంలో, అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించింది.