మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. భోపాల్ జిల్లా నిషాత్‌పురాలోని నబీబాగ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో మంటలు భారీగా చెలరేగడంతో 7 నుండి 8 ఫర్నిచర్ దుకాణాలు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో లక్షల విలువైన ఆస్తి కాలిబూడిదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.