హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హిసార్‌లోని మంగళి రోడ్డులో వివాహానికి వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంకుష్, నిఖిల్, హితేష్ మరియు సాహిల్ అనే నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.