ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 19వ విడతను ఫిబ్రవరి 24న విడుదల చేశారు. ఈ పథకం కింద, DBT ద్వారా దాదాపు 10 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు దాదాపు రూ.23,000 కోట్లు నేరుగా బదిలీ చేశారు. కానీ కొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. మీకు కూడా డబ్బులు పడకపోతే 1800-115-526 లేదా 155261 కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. లేదా మీ సమస్యను pmkisan-ict@gov.in కు ఇమెయిల్ కూడా చేయవచ్చు.