పసిఫిక్ మహా సముద్రంలో లానినా కొనసాగుతున్నప్పటికీ జనవరిలో ప్రపంచవ్యాప్తంగా వేడి వాతావరణం కొనసాగింది. పారిశ్రామిక విప్లవానికి ముందు నమోదైన సగటు ఉష్ణోగ్రత కంటే 1.75 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. గడిచిన 19 నెలల్లో 18 నెలలు.. సగటు ఉష్ణోగ్రత కంటే 1.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్టు కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్, అమెరికాకు చెందిన నోవా విశ్లేషణ వివరాలను ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది.